వయనాడ్:న్యూఢిల్లీ,22,సెప్టెంబర్ (హి.స.) తత్వవేత్త, సంఘ సంస్కర్త నారాయణ గురు మహాసమాధి దినాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీ ఆదివారం ఆయనకు నివాళులర్పించారు. వయనాడ్ జిల్లాలోని కల్పమెట్టలో ‘శ్రీనారాయణ ధర్మ పరిపాలన యోగం’ కార్యాలయాన్ని వారు సందర్శించారు. ‘నారాయణ గురు మనకు బోధించిన అంశాలకుగానూ ఆయన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఆయన చెప్పిన సమానత్వం, సహానుభూతి ప్రస్తుత సమాజానికి ఎంతో అవసరం’ అని ప్రియాంక పేర్కొన్నారు. తర్వాత ప్రియాంక మలప్పురం వెళ్లి ‘సమస్త కేరళ జెమ్-ఇయ్యాతుల్ ఉలేమా’ అధ్యక్షుడు మహమ్మద్ జిఫ్రి ముథుకోయ థంగల్‌తో భేటీ అయ్యారు. కేరళలో, దేశంలో మతసామరస్యాన్ని కాపాడేందుకు గట్టి చర్యలు చేపట్టాల్సిందిగా తాను కోరానని థంగల్ చెప్పారు. వాటికి తమ కుటుంబం ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని ప్రియాంక హామీ ఇచ్చారని తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు