తెలంగాణ ఆర్టీసీలో ఏఐ సేవలు .. పండగల వేళ ఏఐ షెడ్యూలింగ్
హైదరాబాద్, 24 సెప్టెంబర్ (హి.స.) ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం నడుస్తోంది. అన్ని రంగాలను ప్రభావితం చేస్తున్న ఏఐని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వినియోగంలోకి తీసుకువచ్చింది. తమ ఉత్పాదకత పెంపు, సిబ్బంది పనితీరు, ఆరోగ్య స్థితి పర్
ఆర్టీసీ ఏఐ


హైదరాబాద్, 24 సెప్టెంబర్ (హి.స.)

ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం నడుస్తోంది. అన్ని రంగాలను ప్రభావితం చేస్తున్న ఏఐని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వినియోగంలోకి తీసుకువచ్చింది. తమ ఉత్పాదకత పెంపు, సిబ్బంది పనితీరు, ఆరోగ్య స్థితి పర్యవేక్షణ, ఖర్చుల తగ్గింపు, రద్దీకి అనుగుణంగా సర్వీసుల ఏర్పాటుతో పాటు సేవలను మరింత ప్రజానుకూలంగా తీర్చిదిద్దడమే ప్రధాన ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీజీఆర్టీసీ ఇవాళ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ఏఐ ప్రాజెక్టు అమలుకు హన్స ఈక్విటీ పార్టనర్స్ ఎల్ఎల్పీ అనే సంస్థ టీజీ ఆర్టీసీకి తోడ్పాటు అందిస్తున్నదని, సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యం, ప్రణాళికాబద్ధమైన అమలు వ్యూహాలను అందించి, అన్ని డిపోల్లో సులభంగా అమలు జరిగేలా ఆ సంస్థ సహకరిస్తోందని ఆర్టీసీ పేర్కొంది. ---------------

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande