మూడు రాష్ట్రాల్లో CID రెయిడ్స్.. 8 మంది బెట్టింగ్ యాప్స్ నిర్వాహకుల అరెస్ట్
హైదరాబాద్, 24 సెప్టెంబర్ (హి.స.) బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసుల విషయంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని నమోదైన బెట్టింగ్ యాప్స్ కేసులన్నీ సీఐడీ అధినంలోకి వెళ్లాయి. అయితే,
బెట్టింగ్ యాప్


హైదరాబాద్, 24 సెప్టెంబర్ (హి.స.) బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసుల విషయంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని నమోదైన బెట్టింగ్ యాప్స్ కేసులన్నీ సీఐడీ అధినంలోకి వెళ్లాయి. అయితే, విచారణలో భాగంగా బెట్టింగ్ యాప్స్ నిర్వాహకుల్లో చాలామంది ఇతర రాష్ట్రాల వారు ఉన్నట్లుగా పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

ఈ నేపథ్యంలోనే ఇవాళ సీఐడీ అధికారులు మొత్తం మూడు రాష్ట్రాల్లో (రాజస్థాన్, గుజరాత్, పంజాబ్) ఆరు వేర్వేరు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి ఆరు బెట్టింగ్ యాప్స్ ద్వారా ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 8 మందిని నిందితులను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో taj 0077, Fairplay.live, Andhra365, Vlbook, Telugu365, Yes365 బెట్టింగ్ యాప్ సంస్థల నిర్వాహకులు ఉన్నారు. ఇప్పటి వరకు ఆ బెట్టింగ్స్ యాప్ల ద్వారా బాధితులు పెద్ద మొత్తంలో డబ్బు కోల్పోయారని సీఐడీ విచారణలో బట్టబయలైంది. ఈ దాడుల్లో పలు హార్డ్వేర్ పరికరాలు, భారీ ఎత్తున డేటా అధికారులు రికవరీ చేశారు. అదేవిధంగా ఇతర బెట్టింగ్స్ యాప్స్కు సంబధించి విదేశాల్లో ఉండే ప్రధాన నిందితులను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోందని సీఐడీ ADGP చారుసిన్హా వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande