తెలంగాణ, మంచిర్యాల. 24 సెప్టెంబర్ (హి.స.)
ప్రభుత్వం చేపట్టిన వైద్య కళాశాల నిర్మాణ పనుల్లో గుత్తేదారు నాణ్యత ప్రమాణాలు పాటించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జిల్లాలోని హాజీపూర్ మండలం గుడిపేటలో చేపట్టిన ప్రభుత్వ వైద్య కళాశాల భవన భవన నిర్మాణ పనులను బుధవారం పరిశీలించారు. వైద్య కళాశాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అన్నారు. రూ.216 కోట్ల వ్యయం తో చేపట్టిన కళాశాల నిర్మాణ పనుల్లో ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా చూడాలన్నారు. ఇప్పటి వరకు చేసిన పనుల వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రజలకు వైద్య సేవలు చేరువ కనున్నయన్నారు. వైద్య సేవలను అందించడం కోసం వైద్యులు, సిబ్బంది సంఖ్యను పెంపొందించేందుకు ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. 216 కోట్ల రూపాయల నిధులతో నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు, నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు