ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల వేడుక.. ప్రత్యేక ఆకర్షణగా మంత్రి పొంగులేటి!
తెలంగాణ, ఖమ్మం. 24 సెప్టెంబర్ (హి.స.) ఖమ్మం జిల్లాలోని ఆరెంపుల గ్రామం బుధవారం పండుగ వాతావరణంలో కళకళలాడింది. కొత్తగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గుమ్మాల వద్ద పూల తోరణాలు.. ప్రాంగణంలో రంగురంగుల ముగ్గులు.. గృహాల చుట్టూ వినిపించిన మంగళధ్వానాలు కొత్త జీవిత
మంత్రి పొంగులేటి


తెలంగాణ, ఖమ్మం. 24 సెప్టెంబర్ (హి.స.)

ఖమ్మం జిల్లాలోని ఆరెంపుల గ్రామం బుధవారం పండుగ వాతావరణంలో కళకళలాడింది. కొత్తగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గుమ్మాల వద్ద పూల తోరణాలు.. ప్రాంగణంలో రంగురంగుల ముగ్గులు.. గృహాల చుట్టూ వినిపించిన మంగళధ్వానాలు కొత్త జీవితానికి సంకేతాలు వెలిగించాయి. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైన ఈ గ్రామంలో గృహప్రవేశాలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాకతో ఉత్సవం మరింత ఉప్పొంగింది. ఈ వేడుకలో మంత్రి పొంగులేటి వస్త్రధారణ ప్రత్యేక ఆకర్షణగా అందరి చూపులను కట్టిపడేసింది. ఆయన ధరించిన క్రీమ్ కలర్ కుర్తా పైజామా అందరి దృష్టిని తనవైపు తిప్పేసింది. గ్రామస్తులు పొంగులేటి శీనన్న సాదాసీదా స్టైల్ ఎంత బాగుందో! అంటూ చర్చించుకున్నారు. కొత్తగా గృహ ప్రవేశం చేసుకున్న వారందరికీ మంత్రి పొంగులేటి అభినందనలు తెలిపి.. పట్టు వస్త్రాలను కానుకగా సమర్పించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande