ఓజీ సినిమా ఎఫెక్ట్.. భద్రాచలంలో పవర్ స్టార్ ఫ్యాన్స్ వినూత్న నిరసన
తెలంగాణ, భద్రాచలం. 24 సెప్టెంబర్ (హి.స.) పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన చిత్రం ఓజీ కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా హడావుడి నెలకొంది. పలుచోట్ల ఈ ప్రీమియర్ షో టికెట్లకు వేలం నిర్వహించగా.. మరికొన్ని చోట్ల టికెట్లు బ్లాక్ అమ్ముతున్నారనే ఆరోపణలు ఉ
ఓజి


తెలంగాణ, భద్రాచలం. 24 సెప్టెంబర్ (హి.స.) పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన చిత్రం ఓజీ కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా హడావుడి నెలకొంది. పలుచోట్ల ఈ ప్రీమియర్ షో టికెట్లకు వేలం నిర్వహించగా.. మరికొన్ని చోట్ల టికెట్లు బ్లాక్ అమ్ముతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే భద్రాచలంలో పవన్ ఫ్యాన్స్ వినూత్న నిరసన తెలిపారు. భద్రాచలం ఏషియన్ థియేటర్ వద్ద పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ టికెట్ల కోసం ఆందోళన చేపట్టారు. ఫ్యాన్స్కు టికెట్స్ ఇవ్వకపోవడం వల్ల ఓజీ ప్రీమియర్ షో రద్దు అయ్యిందని సినిమా హాల్ ప్రాంగణంలో ఫ్లెక్సీలు అంటించారు. అంతేకాకుండా టికెట్ కౌంటర్, మేనేజర్ రూమ్స్్స్కు తాళాలు వేసి నిరసన వ్యక్తం చేశారు. తమకు నచ్చిన వారికే టికెట్స్ ఇచ్చారని వారు ఆరోపిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande