కాంగ్రెస్, బిజెపి నాయకులు యూరియాను గోదాములకు తరలించారు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
తెలంగాణ, ఆసిఫాబాద్. 24 సెప్టెంబర్ (హి.స.) కాంగ్రెస్, బిజెపి నాయకులు యూరియాను గోదాములకు తరలించారని బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేస
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్


తెలంగాణ, ఆసిఫాబాద్. 24 సెప్టెంబర్ (హి.స.)

కాంగ్రెస్, బిజెపి నాయకులు యూరియాను గోదాములకు తరలించారని బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యూరియాను కాంగ్రెస్, బిజెపి నాయకులు తమ గోదాములకు తరలించి రైతులకు అన్యాయం చేశారని విమర్శించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం, రూ. 270 కు దొరకాల్సిన యూరియా బస్తా బ్లాక్ మార్కెట్లో వేయి రూపాయలకు దొరుకుతుందన్నారు. కాంగ్రెస్ ,బిజెపి నాయకులు తేలు కుట్టిన దొంగలు అన్నారు. పోడు రైతుల ఆకలి చావులకు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఫారెస్ట్ అధికారులు పోడు రైతుల జీవించే హక్కును హరించారన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande