శంషాబాద్లో బీజేపీకి షాక్.. కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన కొలను ప్రదీప్ రెడ్డి
హైదరాబాద్, 24 సెప్టెంబర్ (హి.స.) హైదరాబాద్ శివారు శంషాబాద్ మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీకి (బీజేపీ) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మున్సిపాలిటీలో బీజేపీ సీనియర్ నాయకుడిగా ఉన్న కొలను ప్రదీప్ రెడ్డి బీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ భవన్లో పట్లోళ్ల కార్తీక్ ర
బిజెపి కి షాక్


హైదరాబాద్, 24 సెప్టెంబర్ (హి.స.) హైదరాబాద్ శివారు శంషాబాద్ మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీకి (బీజేపీ) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మున్సిపాలిటీలో బీజేపీ సీనియర్ నాయకుడిగా ఉన్న కొలను ప్రదీప్ రెడ్డి బీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ భవన్లో పట్లోళ్ల కార్తీక్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

శంషాబాద్ ప్రాంతంలో ప్రదీప్ రెడ్డికి ఉన్న మంచి పేరు, ప్రజల్లో ఆయనకు ఉన్న ఆదరణ పార్టీకి మరింత బలం చేకూరుస్తుందని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. కొలను ప్రదీప్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు, అభిమానులు కూడా బీఆర్ఎస్లో చేరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande