హైదరాబాద్, 24 సెప్టెంబర్ (హి.స.)
తెలంగాణలో మరోసారి నిరుద్యోగులు రోడ్డెక్కారు. జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద బుధవారం రోడ్డుపై బైఠాయించారు. వియ్ వాంట్ జస్టిస్ అంటూ ఫ్లకార్డులు, బ్యానర్లు పట్టుకుని నినాదాలు చేశారు. నిరుద్యోగుల ఆందోళనతో మెట్రో స్టేషన్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అదుపు చేసే ప్రయత్నం చేసినప్పటికీ ఫలించలేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలను కల్పించాలని డిమాండ్ చేస్తూ గత 10 రోజులుగా నిరుద్యోగుల హక్కుల వేదిక అధ్యక్షుడు అశోక్ నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈధర్నాలో అశోక్ ఫోటోలతో కూడిన ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ నిరుద్యోగులు ఆందోళనకు దిగారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు