తెలంగాణ ఉద్యమకారిణి నళిని ని పరామర్శించిన ఎంపీ ఈటెల
తెలంగాణ, మేడ్చల్ మల్కాజిగిరి. 27 సెప్టెంబర్ (హి.స.) తెలంగాణ ఉద్యమకారురాలు నళిని అనారోగ్యంతో బాధపడుతుందని తెలిసి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆమెను పరామర్శించారు. శనివారం బోయిన్పల్లిలోని పతంజలి వెల్ నెస్ సెంటర్లో చికిత్స పొందుతున్న నళిని ని, ఎంపీ
ఎంపీ ఈటెల


తెలంగాణ, మేడ్చల్ మల్కాజిగిరి. 27 సెప్టెంబర్ (హి.స.)

తెలంగాణ ఉద్యమకారురాలు నళిని అనారోగ్యంతో బాధపడుతుందని తెలిసి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆమెను పరామర్శించారు. శనివారం బోయిన్పల్లిలోని పతంజలి వెల్ నెస్ సెంటర్లో చికిత్స పొందుతున్న నళిని ని, ఎంపీ కలసి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఉద్యమ సమయాన్ని ఇరువురు గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక పక్క ఉద్యమ తీవ్రత పెరగడం.. మరోపక్క తెలంగాణ అధికారిని అయిన తనపై అణచివేత పెరగడంతో ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం చేశానని నళిని గుర్తుచేసుకున్నారు. వారం రోజుల నుండి విపరీతమైన జ్వరం, కూర్చుంటే లేవలేని పరిస్థితి నెలకొంది, కాళ్ళు వాసిపోయాయి అని తన ఆరోగ్య పరిస్థితిని ఈటలకు వివరించారు.

ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. డి.ఎస్.పి ఉద్యోగానికి రాజీనామా చేసేముందు నళినిని కలిశానని అన్నారు. ప్రభుత్వం నుండి డబ్బులు రావడం కంటే నా ఎమోషన్స్ పట్టించుకోలేదు అనే బాధ ఎక్కువ ఉందని నళిని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిపారు. 21 నెలలు అయినా ఇంకా నిర్ణయం తీసుకోలేదని బాధను వ్యక్తంచేశారని తెలిపారు. 16 పేజీల లేఖను సీఎం రేవంత్ రెడ్డి చేతిలో పెట్టానని, వెంటనే పరిష్కరిస్తారని అనుకున్నా.. ఇలా చేస్తారు అనుకుంటే అసలు వినతిపత్రం ఇచ్చే దానినే కాదని నళిని తన ఆవేదనను వ్యక్తం చేసినట్లు ఏ ఆఫీసర్ కు ఇలా కావద్దు అని తెలిపారు.

కావాల్సిన వైద్యం అందించే ఏర్పాట్లు చేస్తామని, మీకు ఏ ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత నాది అని ఈటల రాజేందర్ నళినికి హామీ ఇచ్చారు. కొంత నయం అయ్యి నడిచే పరిస్థితి వచ్చిన తర్వాత నళినిని కోరుకున్న చికిత్స కోసం హరిద్వారకు పంపించే ఏర్పాటు కూడా చేస్తామని ఈటల రాజేందర్ భరోసా ఇచ్చారు..

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande