హిమాయత్సాగర్ కు వరద పోటు.. మొత్తం గేట్లు ఓపెన్..
హైదరాబాద్, 27 సెప్టెంబర్ (హి.స.) గండిపేట మండల పరిధిలోని హిమాయత్ సాగర్ జలాశయం మొత్తం 11 గేట్లను 6 ఫీట్ల పైకి ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువ ప్రాంతమైన రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జంట జలాశయులకు భారీగా వ
హిమాయత్ సాగర్


హైదరాబాద్, 27 సెప్టెంబర్ (హి.స.)

గండిపేట మండల పరిధిలోని

హిమాయత్ సాగర్ జలాశయం మొత్తం 11 గేట్లను 6 ఫీట్ల పైకి ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువ ప్రాంతమైన రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జంట జలాశయులకు భారీగా వరద ఏరు వచ్చి చేరుతుంది. శనివారం ఉదయం 10 గంటల నుంచి హిమాయత్ సాగర్ జలాశయం నుంచి మొత్తం 20,872 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. అదేవిధంగా ప్రస్తుతం జలాశయానికి 15 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తుంది.

హిమాయత్ సాగర్ మొత్తం గేట్లను ఎత్తడంతో ఈసా నది ఉధృతంగా ప్రవహిస్తుంది. బండ్లగూడ మున్సిపల్ పరిధిలోని కిస్మత్పూర్ వద్ద మూసీలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం పూర్తిగా మునిగిపోయింది. అదేవిధంగా దర్గా కలీజ్ ఖాన్ బ్రిడ్జి వద్ద ప్రమాదకరంగా నీరు ప్రవహిస్తుంది. ఔటర్ రింగ్ రోడ్డు మీద నుంచి వెళ్లే వాహనదారులు తమ వాహనాలను నిలిపి ఈసా ఉధృతిని ఆసక్తిగా గమనిస్తున్నారు. ఉస్మాన్సాగర్ 15 గేట్లను 9 ఫీట్ల మేర పైకి ఎత్తినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఇన్స్లో 12660 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 12660 క్యూసెక్కులు ఉన్నట్లు తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande