లంగర్ హౌస్ ను ముంచెత్తిన మూసీ.. నీట మునిగిన బాపు ఘాట్..
హైదరాబాద్, 27 సెప్టెంబర్ (హి.స.) భారీ వర్షాల నేపథ్యంలో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నది ఉధృతికి పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. నది సమీపంలోని ప్రాంతాలకు కూడా వరద పోటెత్తింది. దీంతో లంగర్ హౌస్లోని పలు ప్రాంతాలు వరద నీటితో నిండిపోయాయి. స్థానికంగా
బాపు ఘాట్


హైదరాబాద్, 27 సెప్టెంబర్ (హి.స.) భారీ వర్షాల నేపథ్యంలో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది.

నది ఉధృతికి పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. నది సమీపంలోని ప్రాంతాలకు కూడా వరద పోటెత్తింది. దీంతో లంగర్ హౌస్లోని పలు ప్రాంతాలు వరద నీటితో నిండిపోయాయి. స్థానికంగా ఉన్న బాపూ ఘాట్ కూడా నీట మునిగింది. సమీపంలో ఉన్న ఫ్లై ఓవర్ కింద వరద నీటితో నిండిపోవడంతో ఆ ప్రాంతమంతా చెరువును తలపిస్తోంది. భారీ వరద నేపథ్యంలో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ, స్థానికులను అప్రమత్తం చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande