హైదరాబాద్, 27 సెప్టెంబర్ (హి.స.)
అర్బన్ ప్రాంతాల్లో పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలతో పాటు సొంత స్థలాలుకలిగిన వారికి ఇండ్ల నిర్మాణం విషయంలో ప్రభుత్వం అతి త్వరలోనే శుభవార్త చెప్పబోతున్నదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇవాళ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం రసూల్పూరలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే ఆలోచన లేకపోవడం దురదృష్టకరం అని విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన చెడులను మా ప్రభుత్వం సరిదిద్దుతూ వస్తోందన్నారు. పేద ప్రజలకు ఇండ్లు కట్టివ్వాలనే కనీస జ్ఞానం గత ప్రభుత్వానికి లేదని కమిషన్లు రావనే పేదలకు ఇండ్లు ఇవ్వలేదని, కమిషన్ల కోసమే కాళేశ్వరం కట్టారని ఆరోపించారు. గడిచిన పదేళ్లలో ఏడాదికి లక్ష ఇండ్లు నిర్మించి ఇస్తే ఈ పాటికి పది లక్ష ఇండ్లు పేదలకు దక్కేవన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా ఇండ్ల విషయంలో మా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందన్నారు. అర్హులైన వారందరికీ ఇండ్లు ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు