వికారాబాద్లో జిల్లాలో భారీ వర్షం.. ఈసా, మూసీ నదుల్లోకి చేరుతున్న వరద
వికారాబాద్, 27 సెప్టెంబర్ (హి.స.) వికారాబాద్ జిల్లాలో వరుసగా రెండో రోజూ భారీ వర్షం కురుస్తున్నది. వాగులు, కుంటలు పొంగిపొర్లుతుండటంతో ఈసా, మూసీ నదుల్లోకి భారీగా వరద వచ్చి చేరుతున్నది. ఎడతెరపి లేకుండా వానలు కురుస్తుండటంతో అనంతగిరి కొండల నుంచి వరద ప్ర
వికారాబాద్ వర్షం


వికారాబాద్, 27 సెప్టెంబర్ (హి.స.)

వికారాబాద్ జిల్లాలో వరుసగా రెండో రోజూ భారీ వర్షం కురుస్తున్నది. వాగులు, కుంటలు పొంగిపొర్లుతుండటంతో ఈసా, మూసీ నదుల్లోకి భారీగా వరద వచ్చి చేరుతున్నది. ఎడతెరపి లేకుండా వానలు కురుస్తుండటంతో అనంతగిరి కొండల నుంచి వరద ప్రవాహం లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. ఈ నేపథ్యంలో అనంతగిరి, కోటిపల్లి ప్రాజెక్టులకు పర్యాటకులు రావొద్దని అధికారులు సూచించారు. వికారాబాద్లో కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

ఇక తాండూరులో కాగ్నా నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. తాండూరు మండలం వీర్శెట్టిపల్లిని వరద నీరు చుట్టుముట్టింది. గ్రామ ప్రజలు జలదిగ్భంధంలో చిక్కుకుపోయారు. ఇండ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. భారీ వర్షాలతో కాగ్నా నది పాత వంతెనపై నుంచి వరద ప్రవహిస్తున్నది. బషీరాబాద్ మండలం జీవగ్గీ, నావాండ్ది వద్ద ఉధృతంగా నది ప్రవహిస్తున్నది.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande