అమరావతి, 27 సెప్టెంబర్ (హి.స.)
తిరుమల: శ్రీవారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి ఉదయం కల్పవృక్ష వాహన సేవ నిర్వహించారు. ఛర్నాకోల్ చేతబట్టి రాజమన్నార్ రూపధారిగా దేవదేవుడు దర్శనమిచ్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. రాత్రి 7-9 గంటల వరకు సర్వభూపాల వాహనసేవ జరగనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ