కూటమి ప్రభుత్వం వచ్చాక 15. నెలలలోనే పర్యాటక రంగంలో 103 సంస్థలలో ఒప్పందం
అమరావతి, 28 సెప్టెంబర్ (హి.స.) ,కూటమి ప్రభుత్వం వచ్చాక 15నెలల కాలంలోనే పర్యాటక రంగంలో 103 సంస్థలతో అవగాహన ఒప్పందాలు చేసుకుని మొత్తం రూ.10,644 కోట్ల పెట్టుబడులు సాధించామని మంత్రి కందుల దుర్గేశ్‌ తెలిపారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ సహకారంతో వివిధ పథకాల
కూటమి ప్రభుత్వం వచ్చాక 15. నెలలలోనే పర్యాటక రంగంలో 103 సంస్థలలో ఒప్పందం


అమరావతి, 28 సెప్టెంబర్ (హి.స.)

,కూటమి ప్రభుత్వం వచ్చాక 15నెలల కాలంలోనే పర్యాటక రంగంలో 103 సంస్థలతో అవగాహన ఒప్పందాలు చేసుకుని మొత్తం రూ.10,644 కోట్ల పెట్టుబడులు సాధించామని మంత్రి కందుల దుర్గేశ్‌ తెలిపారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ సహకారంతో వివిధ పథకాల ద్వారా రూ.441 కోట్ల నిధులు రాబట్టామని చెప్పారు. శనివారం అసెంబ్లీలో మంత్రి మాట్లాడారు. పర్యాటక రంగం అభివృద్ధికి అన్ని చర్యలూ తీసుకున్నట్టు తెలిపారు. 2029 నాటికి 50వేల గదుల ఏర్పాటు లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. ప్రశ్నోత్తరాల సమయంలో చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. చీరాల నియోజకవర్గంలో చారిత్రక ప్రదేశాలైన మోటుపల్లి, పురాతన వీరభద్రస్వామి గుడిని ప్రధాన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రూపొందించిన ప్రణాళికలను వివరించారు. చీరాల సమీపంలో బీచ్‌ రహదారుల అనుసంధానం, రోడ్లు, పర్యాటకులకు సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించామని మంత్రి వివరించారు. సీఎం సూచన మేరకు క్యారవాన్‌ టూరిజాన్ని అందుబాటులోకి తీసువస్తున్నామని తెలిపారు. కేంద్ర సహకారంతో రాజమహేంద్రవరంలో రూ.94.44 కోట్లతో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు, కడప జిల్లాలో రూ.77.91 కోట్లతో గండికోట, రూ.97.52 కోట్లతో సూర్యలంక బీచ్‌ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రూ.29 కోట్లతో బొర్రా గుహల్లో ఎక్స్‌పీరియెన్స్‌ సెంటర్‌, రూ.50 కోట్లతో అహోబిలం, నాగార్జున సాగర్‌లలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి వివరించారు. రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధికి చర్యలు తీసుకునే ముందు ఎమ్మెల్యేలతో ఒక కమిటీని ఏర్పాటుచేసి, గోవా వెళ్లి అధ్యయం చేసి రావాలని స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు సూచించారు. త్వరలోనే ఎమ్మెల్యేలతో కమిటీ ఏర్పాటు చేస్తామని మంత్రి దుర్గేశ్‌ చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande