కరూర్, 28 సెప్టెంబర్ (హి.స.)
తమిళనాడు కరూర్ తొక్కిసలాటలో 39 మంది చనిపోయారు. 111కి మందికి పైగా గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. చెన్నై దుండిగల్ జిల్లా కరూర్ లో టీవీ కే పార్టీ అధ్యక్షుడు హీరో విజయ్ రోడ్ షో నిర్వహించారు. దీంతో హీరో విజయ్ ను చూసేందుకు భారీగా జనాలు ఎగబడ్డారు. ఈ ఘటనలో చిన్న పిల్లలతో సహా దాదాపు 39 మంది చనిపోయారు.. 111 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అందులో కొంద మంది పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు దిండిగల్ కలెక్టర్ శరణనన్ తెలిపారు. మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేశాం వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నాం ఆయన చెప్పారు.
గాయపడిన బాధ్యతలను ఆసుపత్రిలో సీఎం స్టాలిన్ పరామర్శించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. చనిపోయిన వారికి పది లక్షలు గాయపడిన వారికి లక్ష రూపాయలు పరిహారం ప్రకటించారు సీఎం స్టాలిన్. అనంతరం తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించారు. రిటైర్డ్ జస్టిస్ అరుణా జగదీశన్ నేతృత్వంలో విచారణ చేపట్టనున్నట్లు సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ