అమరావతి, 29 సెప్టెంబర్ (హి.స.)
కాకినాడ: కారులో గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.29 లక్షల విలువైన 384 కిలోల గంజాయి, కారు, 2 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం నుంచి రాజమహేంద్రవరానికి గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించారు. వివరాలను ఎస్పీ బింధుమాధవ్ మీడియాకు వెల్లడించారు. ‘‘విశాఖ జిల్లా భీమునిపట్నం వద్ద టోల్ సిబ్బందిని కారు ఢీ కొట్టింది. కృష్ణంపాలెం వద్ద పోలీసులను చూసి నిందితులు పారిపోయే ప్రయత్నం చేశారు. కారును వెంబడించి పట్టుకున్నాం. ముగ్గురుని అరెస్టు చేశాం. మరో ఐదుగురు పరారీలో ఉన్నారు. మొత్తం 350 ప్యాకెట్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నాం’’ అని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ