దక్షిణ కొరియా లో ఏపీ మంత్రుల.పర్యటన
అమరావతి/దక్షిణ కొరియ:29 సెప్టెంబర్ (హి.స.)కొరియాలో ఏపీ మంత్రులు పి.నారాయణ), బీసీ జనార్ధన్ రెడ్డిల ) బృందం పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా ఎల్జీ కంపెనీ ప్రతినిధులతో మంత్రులు భేటీ అయ్యారు. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీ
దక్షిణ కొరియా లో ఏపీ మంత్రుల.పర్యటన


అమరావతి/దక్షిణ కొరియ:29 సెప్టెంబర్ (హి.స.)కొరియాలో ఏపీ మంత్రులు పి.నారాయణ), బీసీ జనార్ధన్ రెడ్డిల ) బృందం పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా ఎల్జీ కంపెనీ ప్రతినిధులతో మంత్రులు భేటీ అయ్యారు. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీ ఎల్జీ సంస్థ హెడ్ క్వార్టర్‌లో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎల్జీ కార్యాలయానికి విచ్చేసిన మంత్రులు పి. నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డిల బృందానికి ఎల్జీ సంస్థ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం.. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వంటి అంశాలను ఈ సందర్భంగా ఎల్జీ ప్రతినిధులకు మంత్రులు వివరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande