హైదరాబాద్, 29 సెప్టెంబర్ (హి.స.) ఆసియా కప్ ఫైనల్లో ఓ నాటకీయ పరిణామం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఫైనల్లో పాక్పై భారత్ ఘన విజయం సాధించగా.. ట్రోఫీ ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మోసిన్ నక్వి చేతుల మీదుగా తీసుకోవడానికి నిరాకరించింది. దీంతో ఆసియా కప్, పతకాలతో నఖ్వీ అక్కడి నుంచి వెళ్లిపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నఖ్వీ తీరుపై బీసీసీఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ విషయంపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందిస్తూ.. మన దేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్న వ్యక్తి నుంచి భారత జట్టు ట్రోఫీని స్వీకరించలేదని తెలిపారు. అంతమాత్రాన ఆయన ట్రోఫీని, పతకాలను తన హోటల్కు ఎలా తీసుకెళ్తారు..? అంటూ ప్రశ్నించారు. ఇది ఊహించని పరిణామం అని పేర్కొన్నారు. దీనిపై నవంబర్ మొదటి వారంలో దుబాయ్ వేదికగా జరిగే ఐసీసీ సమావేశంలో ఈ విషయంపై గట్టిగా నిరసన తెలుపుతామని ఆయన వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు