కరూర్ తొక్కిసలాట.. ఘటనా స్థలాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి నిర్మలమ్మ
తమిళనాడు, 29 సెప్టెంబర్ (హి.స.) టీ వీ కే అధినేత, ప్రముఖ నటుడు విజయ్ నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట ఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెను విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 41 మంది మరణించగా, అనేక మంది గాయపడ్డారు. క్షతగాత్రులు ప్రస్తుతం ఆస్పత్
నిర్మల సీతారామన్


తమిళనాడు, 29 సెప్టెంబర్ (హి.స.)

టీ వీ కే అధినేత, ప్రముఖ నటుడు విజయ్ నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట ఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెను విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 41 మంది మరణించగా, అనేక మంది గాయపడ్డారు. క్షతగాత్రులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ నేపథ్యంలో తొక్కిసలాట ఘటన ప్రాంతాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సందర్శించారు. కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ తో కరూర్ చేరుకున్న నిర్మలమ్మ ఘటనాస్థలిని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కూడా కలిసి మాట్లాడారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande