స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు, ఆశీర్వదిస్తారు: డిప్యూటీ సీఎం భట్టి
తెలంగాణ, ఖమ్మం. 29 సెప్టెంబర్ (హి.స.) స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర ప్రజలు ఆదరిస్తారు, ఆశీర్వదిస్తారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం ఉదయం మధిర క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పెద్దలు 10
డిప్యూటీ సీఎం


తెలంగాణ, ఖమ్మం. 29 సెప్టెంబర్ (హి.స.)

స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర

ప్రజలు ఆదరిస్తారు, ఆశీర్వదిస్తారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం ఉదయం మధిర క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పెద్దలు 10 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఆర్థిక, పాలన వ్యవస్థలను విధ్వంసం చేస్తే ప్రణాళిక ప్రకారం వాటిని సరి చేసుకుంటూ ప్రజా ప్రభుత్వం ముందుకు పోతుందని అన్నారు. రాష్ట్రంలోని రైతులు, మహిళలు, యువత కోసం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు వారి హృదయాలకు, మనసులకు బాగా తెలుసు అని అన్నారు. సామాజిక న్యాయం కోసం రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, ఇందిరమ్మ ప్రభుత్వం బీసీల దశాబ్దాల కోరికను నెరవేర్చింది అన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande