హైదరాబాద్, 29 సెప్టెంబర్ (హి.స.)
పైరసీ రాయుళ్ల విషయమై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ CV ఆనంద్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ నిర్మాత దిల్ రాజు మీడియా వేదికగా పలు అంశాలు పంచుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పైరసీ, బెట్టింగ్ యాప్ల ప్రచారంపై సినీ పరిశ్రమ నిరంతరం పోరాటం చేస్తోందని, ఈ పోరాటంలో హైదరాబాద్ పోలీసులు కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఇందుకు హైదరాబాద్ పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతూ.. పైరసీ పెరుగుతున్న కొద్దీ నేరాలు కూడా పెరుగుతున్నాయని ఆయన అన్నారు.
సినిమా పరిశ్రమ నుండి ప్రభుత్వం జీఎస్టీ రూపంలో 18 శాతం ఆదాయాన్ని పొందుతుందని, అయితే పైరసీ వల్ల ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కూడా దెబ్బతింటుందని దిల్ రాజు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ను సినిమా హబా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని, అందుకు పైరసీని అరికట్టడం చాలా ముఖ్యమని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..