తెలంగాణ, నల్గొండ. 29 సెప్టెంబర్ (హి.స.)
స్థానిక సంస్థల ఎన్నికల కోడ్
రావడంతో నియోజకవర్గ కేంద్రమైన తుంగతుర్తిలో అధికారులు అలర్ట్ అయ్యారు. స్థానిక తహశీల్దార్ దయానందం, ఎంపీడీవో శేషు కుమార్ రంగంలోకి దిగి వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రచారాల ఫ్లెక్సీలతో పాటు వాల్ రైటింగ్, వాల్ పోస్టర్లను గ్రామపంచాయతీ సిబ్బందితో కలిసి తొలగించారు. అంబేద్కర్, తెలంగాణ తల్లి చౌరస్తాలో కాంగ్రెస్, సీపీఎం, బీఆర్ఎస్, ఇతర పార్టీలకు చెందిన వాటన్నింటినీ తొలగించారు. అంతేకాకుండా గ్రామాలలో ఉన్న వివిధ రాజకీయ పార్టీల ప్రచార సామాగ్రినంత తొలగించారు. ఎన్నికల కోడ్ వచ్చిన దృష్ట్యా ప్రభుత్వ అనుమతులు లేకుండా ఎలాంటి ప్రచారాలు నిర్వహించవద్దని వారు ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు