తెలంగాణ, 29 సెప్టెంబర్ (హి.స.) మంచిర్యాల జిల్లా హాజీపూర్
మండలం గుడిపేటలోని బృందావన్ కాలనీ సమీపంలో రూ.500 నకిలీ కరెన్సీ నోట్ల కట్టలు కలకలం రేపాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కారులో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు లక్సెట్టిపేట వైపు నుంచి మరో వ్యక్తి మంచిర్యాల వైపు నుంచి బైక్ పై వచ్చి నోట్లు మార్పిడి చేస్తుండగా ఇరువురి మధ్య గొడవ తలెత్తింది. అది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ ఇద్దరు వదిలేసి వెళ్లిన నకిలీ రూ.500 తొమ్మిది కట్టలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దుండగులను పట్టుకోవడానికి నిఘా ఏర్పాటు చేసినట్లు ప్రాథమిక దర్యాప్తు అనంతరం కేసు నమోదు చేస్తామని హాజీపూర్ పోలీసులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు