మూడు నెలలుగా అందని జీతాలు.. పంచాయతీ కార్మికుల నిరసన
తెలంగాణ, నిజామాబాద్. 29 సెప్టెంబర్ (హి.స.) మూడు నెలలుగా బకాయి పడిన వేతనాలు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని పంచాయతీ కార్మికులు డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఎదుట పారిశుద్ధ్య కార్మికులు, పంచాయతీ కార్మికులు నిరస
పంచాయతీ కార్మికులు


తెలంగాణ, నిజామాబాద్. 29 సెప్టెంబర్ (హి.స.)

మూడు నెలలుగా బకాయి పడిన వేతనాలు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని పంచాయతీ కార్మికులు డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఎదుట పారిశుద్ధ్య కార్మికులు, పంచాయతీ కార్మికులు నిరసన తెలుపుతూ ధర్నాకు దిగారు. బకాయిలు చెల్లిస్తేనే విధులు చేపడతామని హెచ్చరించారు. జీతాలు ఇవ్వకపోతే ఎలా బతికేదని ప్రశ్నించారు. దసరా పండుగ ఉన్నప్పటికీ జీతం చెల్లించకుంటే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్లో ఉన్న మూడు నెలల జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande