టీమిండియాకి మెగాస్టా ప్రత్యేక శుభాకాంక్షలు.. తెలుగు తేజంపై ప్రశంసలు
హైదరాబాద్, 29 సెప్టెంబర్ (హి.స.) ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్పై ఘన విజయం సాధించి, చారిత్రక మైలురాయిని చేరుకుంది. ఈ అద్భుత విజయంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. భారత జట్టు ప్రదర్శించిన పోరాట స్ఫూర్తి, నైపుణ్యం పై ప్
చిరంజీవి


హైదరాబాద్, 29 సెప్టెంబర్ (హి.స.)

ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో భారత

క్రికెట్ జట్టు పాకిస్థాన్పై ఘన విజయం సాధించి, చారిత్రక మైలురాయిని చేరుకుంది. ఈ అద్భుత విజయంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. భారత జట్టు ప్రదర్శించిన పోరాట స్ఫూర్తి, నైపుణ్యం పై ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. యువ ఆటగాడు తిలక్ వర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడంతో అతనిపై కూడా ప్రశంసల వర్షం కురుస్తుంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియాలో.. ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్పై టీమిండియా చూపించిన ప్రదర్శన అద్భుతం. టీమ్ ప్రదర్శించిన పోరాట స్ఫూర్తి, నైపుణ్యం, సంయమనం మెచ్చుకోవల్సిందే. ప్రత్యేకంగా తిలక్ వర్మకు అభినందనలు. ప్రతి భారతీయుడికి ఇది గర్వకారణం” అని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande