హైదరాబాద్, 29 సెప్టెంబర్ (హి.స.)
ఖైరతాబాద్ మింట్ క్యాంపస్ లో
ఇందిరమ్మ క్యాంటీన్ ను జిల్లా ఇంచార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రారంభించారు. సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి కర్ణన్, జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి అదనపు కమిషనర్ లు రఘు ప్రసాద్, పంకజ పాల్గొన్నారు. లబ్ధిదారులకు స్వయంగా మంత్రి, మేయర్, ప్రజా ప్రతినిధులు అల్పాహారం వడ్డించి లబ్ధిదారులతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గరీబీ హటావో అనే నినాదంతో ఇందిరమ్మ పేదల అభివృద్ధికి కృషి చేసింది. హరే కృష్ణ హరే రామ సహకారంతో ప్రభుత్వ ఆర్థిక సబ్సిడీతో ఇందిరమ్మ క్యాంటీన్ ల ద్వారా పేదలకు అల్పాహారం, భోజనం అందిస్తున్నాం అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..