సమాజంలో సకారాత్మక పరివర్తనే లక్ష్యం- ఆర్ఎస్ఎస్ కరీంనగర్ విభాగ్ ప్రచారక్ బానుచందర్
తెలంగాణ, కరీంనగర్. 29 సెప్టెంబర్ (హి.స.) సమాజంలో సకారాత్మక పరివర్తన తీసుకురావడమే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లక్ష్యమని ఆర్ఎస్ఎస్ కరీంనగర్ విభాగ్ ప్రచారక్ బానుచందర్ పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా కేశవ నగర్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించి
ఆర్ఎస్ఎస్


తెలంగాణ, కరీంనగర్. 29 సెప్టెంబర్ (హి.స.)

సమాజంలో సకారాత్మక పరివర్తన తీసుకురావడమే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లక్ష్యమని ఆర్ఎస్ఎస్ కరీంనగర్ విభాగ్ ప్రచారక్ బానుచందర్ పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా కేశవ నగర్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విజయదశమి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సమాజంలో సకారాత్మక పరివర్తన తీసుకురావడం, వ్యక్తి నిర్మాణం ద్వారా దేశ నిర్మాణం చేయడమే ఆర్ఎస్ఎస్ లక్ష్యమని అన్నారు. 1925లో ప్రారంభమై నేడు దేశవ్యాప్తంగా విస్తృత శాఖలతో, విభిన్న రంగాల్లో దేశభక్తి పూరిత, హిందుత్వ ఆధార సంస్థలతో ప్రపంచంలోని అనేక దేశాలలో పనిచేస్తుందని చెప్పారు. హిందువులలో ఐక్యతను శాఖ ఆధారంగా సంఘం పెంపొందిస్తుందని పేర్కొన్నారు. హిందుత్వం జీవన విధానం, విశ్వశాంతికి ఆధారం, ప్రపంచంలోని వివిధ మతాలను సమన్వయ పరిచే సనాతన జీవన విలువలు హిందుత్వంలో ఉన్నాయని వివరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande