రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎం.హరిత..
తెలంగాణ, రాజన్న సిరిసిల్ల. 29 సెప్టెంబర్ (హి.స.) రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా 2013 బ్యాచ్ కు చెందిన ఎం.హరితను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా ఆమె సోమవారం జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. అన
కలెక్టర్ హరిత


తెలంగాణ, రాజన్న సిరిసిల్ల. 29 సెప్టెంబర్ (హి.స.)

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా 2013 బ్యాచ్ కు చెందిన ఎం.హరితను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా ఆమె సోమవారం జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు పుష్పగుచ్చం అందజేసి, శుభాకాంక్షలు తెలియజేశారు. తదనంతరం వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు, అధికారులు, సిబ్బంది కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా ఆమె స్థానంలో పనిచేస్తున్న సందీప్ కుమార్ ఝా రోడ్లు, ట్రాన్స్పోర్ట్, బిల్డింగ్ డిపార్ట్మెంట్కి స్పెషల్ సెక్రటరీగా బదిలీ అయ్యారు. అయితే ఎం.హరిత అంతకుముందు విద్యా శాఖ జాయింట్ సెక్రటరీ, సహకార శాఖ డైరెక్టర్, రిజిస్ట్రార్ ఆఫ్ కో-ఆపరేటివ్గా పని చేశారు. 2022లో విద్యాశాఖ డిప్యూటీ సెక్రటరీగా, వరంగల్ రూరల్ కలెక్టర్గా బాధ్యతలు నిర్వర్తించారు. ---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande