హైదరాబాద్, 29 సెప్టెంబర్ (హి.స.)
రాజేంద్రనగర్ డివిజన్ నూతన
డీసీపీగా యోగేష్ గౌతమ్ ఐపీఎస్ పదవి బాధ్యతలు స్వీకరించారు. సోమవారం రాజేంద్రనగర్ లోని పశు వైద్య విశ్వవిద్యాలయంలో గల డీసీపీ కార్యాలయంలో యోగేష్ గౌతమ్ పూర్వపు డీసీపీ చింతమనేని శ్రీనివాస్ నుంచి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన డీసీపీ యోగేష్ గౌతమ్ మాట్లాడుతూ అసాంఘిక శక్తుల పట్ల పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండి కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల పోలీస్ అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండి ప్రజలకు మెరుగైన భద్రత కల్పించాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..