తెలంగాణ, మెదక్. 29 సెప్టెంబర్ (హి.స.)
పేకాట రాయుళ్ల శిబిరంపై మెదక్ జిల్లా పోలీసులు మెరుపు దాడి చేశారు. పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు ఎస్ఐ రంజిత్ కుమార్ రెడ్డి తన టీంతో కలిసి పేకాట శిబిరంపై దాడి చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
వారు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి గ్రామ శివారులోని అనన్య ఫామ్ హౌస్లో చట్ట విరుద్ధంగా పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు ఆదివారం రాత్రి దాడులు నిర్వహించడం జరిగింది. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నాం. వీరి వద్ద నుండి రూ.3,800 నగదు, 104 ప్లేయింగ్ కార్డ్స్, షిఫ్ట్ కారు, రెండు బైకులు, 55 గేమింగ్ కాయిన్స్, 6 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకోవడం జరిగిందని వెల్లడించారు.
వీరితోపాటు పేకాట ఆడుతున్న మరో నలుగురు వ్యక్తులు పరారీలో ఉన్నట్లు ఆయన తెలిపారు. పేకాటరాయుళ్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. చట్ట విరుద్ధమైన పేకాట లాంటి ఆటలు ఆడితే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు