గుజరాత్, 29 సెప్టెంబర్ (హి.స.)
గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న ఓ టక్కును ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బలంగా ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా.. అనేక మంది గాయపడ్డారు.
పోలీసు ఇన్స్పెక్టర్ పర్బాద్ వందా తెలిపిన వివరాల ప్రకారం.. బోటాడ్ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని రాన్పూర్ తాలూకా నుంచి పర్యాటకులను తీసుకెళ్తున్న బస్సు పాలియాద్ పట్టణ సమీపంలో ఆగి ఉన్న ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 20 మంది వరకూ గాయపడ్డారు. క్షతగాత్రులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు వివరించారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..