ఇ-మెయిల్‌ తరహాలో యూపీఐ ఐడీ
ముంబయి,30సెప్టెంబర్ (హి.స.) దేశంలో యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) చెల్లింపులకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఈ విధానంలో ప్రతి నెలా రూ.లక్షల కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మోసాలూ పెరిగాయి. యూపీఐ ఐడీలతో ముడిపడిన రహస్య వివరాలను బయటపెట్ట
UPI transaction


ముంబయి,30సెప్టెంబర్ (హి.స.) దేశంలో యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) చెల్లింపులకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఈ విధానంలో ప్రతి నెలా రూ.లక్షల కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మోసాలూ పెరిగాయి. యూపీఐ ఐడీలతో ముడిపడిన రహస్య వివరాలను బయటపెట్టేందుకు మోసగాళ్లు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు పరిష్కారంగా కొత్త రక్షణ చర్యలను యూపీఐ సేవలను అందించే సంస్థలు తీసుకొస్తున్నాయి. యూపీఐ ఐడీలను ఇ-మెయిల్‌ చిరునామాలాగా సరళంగా, అక్షరాలు, అంకెలు మిశ్రమంతో రూపొందించే అవకాశాన్ని ఇస్తున్నాయి.

అక్షరాలు, అంకెల మిశ్రమంగా ఐడీ

అక్టోబరు 2 నుంచి యూపీఐ చెల్లింపులకు కొత్త నిబంధనలను నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) అమలు చేయనుంది. దీనికి తగ్గట్లు యూపీఐ చెల్లింపుల సేవల సంస్థలు ఏర్పాట్లు చేస్తున్నాయి. సాధారణంగా యూపీఐ ఐడీలు మొబైల్‌ నంబరు ఆధారంగా ఉంటాయి. దీనికి బదులు యూపీఐ ఐడీని అక్షరాలు, అంకెల మిశ్రమంతో.. మనకు నచ్చినట్లు రూపొందించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. దీనివల్ల మొబైల్‌ నంబరు చెప్పాల్సిన అవసరం లేకుండానే, చెల్లింపులు చేయొచ్చు. స్వీకరించొచ్చు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande