ముంబయి,30సెప్టెంబర్ (హి.స.) మయన్మార్‌లో భూకంపం సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున బలమైన భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై భూకంప తీవ్రత 4.7గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. మయన్మార్ భూకంపం భారతదేశాన్ని కూడా కుదిపేసింది. మణిపూర్, నాగాలాండ్, అస్సాంతో సహా భారతదేశంలోని అనేక ప్రాంతాలలో ప్రకంపనలు సంభవించాయి. ప్రస్తుతానికి ఎలాంటి నష్టం జరిగినట్లు సమాచారం లేదు.
నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకారం.. భూకంపం మణిపూర్‌లోని ఉఖ్రుల్‌కు ఆగ్నేయంగా 27 కిలోమీటర్ల దూరంలో, మయన్మార్‌లోని భారత సరిహద్దుకు చాలా దగ్గరగా సంభవించింది. మంగళవారం ఉదయం 6:10 గంటలకు భూకంపం సంభవించింది. 15 కిలోమీటర్లు లోతులో భూకంపం సంభవించింది. అర్ధరాత్రి 12.09 గంటలకు మహారాష్ట్రలోని సతారాలో 3.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం లోతు 5 కిమీ కాగా.. కొల్హాపూర్‌కు వాయువ్యంగా 91 కిమీ దూరంలో ఉంది. మంగళవారం తెల్లవారుజామున 4.28 గంటల ప్రాంతంలో టిబెట్‌లో 3.3 తీవ్రతతో భూకంపం సంభవించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ