అమరావతి, 29 సెప్టెంబర్ (హి.స.)
తిరుపతి : జిల్లాలోని నారాయణవనం సిద్ధార్థ కాలేజీ హాస్టల్‌లో దారుణం చోటు చేసుకుంది. జూనియర్ విద్యార్థిపై సీనియర్ విద్యార్థులు విచక్షణారహితంగా దాడి చేశారు. కాళ్లతో తన్నుతూ జూనియర్ విద్యార్థి పట్ల కిరాతకంగా ప్రవర్తించారు. సిద్ధార్థ కాలేజీలో మొదటి సంవత్సరం పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థిపై సీనియర్ విద్యార్థులు దాడి చేశారు. అంతేకాకుండా తామోదో గొప్ప ఘనకార్యం చేస్తున్నట్లుగా విద్యార్థిని కొడుతున్న దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. మొత్తం ఆరుగురు సీనియర్ విద్యార్థులు ఈ దారుణానికి పాల్పడ్డారు. దాడి చేయడంతో పాటు ఈ విషయాన్ని బయటకు చెప్తే చంపేస్తాం అంటూ బెదిరింపులకు దిగారు. కాగా... ఈ విషయం బయటపడటంతో వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అయితే ఓ యువతి ప్రేమ వ్యవహారంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు చెబుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ