సూర్యకుమార్ యాదవ్ గొప్ప మనసు.. ఫీజు మొత్తం ఇండియన్ ఆర్మీకి ఇవ్వనున్నట్లు ప్రకటన..
హైదరాబాద్, 29 సెప్టెంబర్ (హి.స.) టీమ్ ఇండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆసియా కప్ టోర్నమెంట్ ఆడినందుకు తనకు వచ్చే మ్యాచ్ ఫీజును భారత సైన్యానికి, పహల్గామ్ ఉగ్రదాడి బాధితుల కుటుంబాలకు విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించి తన
కెప్టెన్ సూర్య కుమార్


హైదరాబాద్, 29 సెప్టెంబర్ (హి.స.)

టీమ్ ఇండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఆసియా కప్ టోర్నమెంట్ ఆడినందుకు తనకు వచ్చే మ్యాచ్ ఫీజును భారత సైన్యానికి, పహల్గామ్ ఉగ్రదాడి బాధితుల కుటుంబాలకు విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించి తన గొప్ప మనసులు చాటుకున్నారు. ఆసియా కప్ ఫైనల్ విజయం అనంతరం సూర్య కుమార్ యాదవ్ ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. 'ఈ టోర్రమెంట్ ద్వారా నాకు వచ్చే మ్యాచ్ ఫీజును సాయుధ దళాలకు, పహల్గాం ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు సాయం చేయడానికి దానం చేయాలని నిర్ణయించుకున్నాను. జై హింద్' అంటూ తన పోస్ట్లో రాసుకొచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande