ఆసియా కప్ విజేత భారత్ కు బీసీసీఐ 21 కోట్ల భారీ నజరానా.
హైదరాబాద్, 29 సెప్టెంబర్ (హి.స.) ఆసియా కప్ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను భారత్ చిత్తుచేసింది. సమిష్టి ప్రదర్శనతో కదంతొక్కుతూ పాక్ను ఓడించిన టీం ఇండియా... రికార్డు స్థాయిలో తొమ్మిదో సారి ఆసియాకప్ను గెలుచుకుంది. దీంతో భారత జట్టుపై ప్రశంసల వర
టీమిండియా


హైదరాబాద్, 29 సెప్టెంబర్ (హి.స.) ఆసియా కప్ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను భారత్ చిత్తుచేసింది. సమిష్టి ప్రదర్శనతో కదంతొక్కుతూ పాక్ను ఓడించిన టీం ఇండియా... రికార్డు స్థాయిలో తొమ్మిదో సారి ఆసియాకప్ను గెలుచుకుంది. దీంతో భారత జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. జట్టు విజయంపై భారత క్రికెట్ బోర్డు (BCCI) కూడా తన సంతోషాన్ని పంచుకుంది. ఈ సందర్భంగా కీలక ప్రకటన చేసింది. ఆసియా కప్లో విజేతగా నిలిచిన భారత జట్టుకు భారీ నజరానా ప్రకటించింది. రూ.21 కోట్ల ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్లు ఎక్స్ వేదికగా ప్రకటించింది. ఈ మొత్తాన్ని ఆటగాళ్లతోపాటూ సహాయ సిబ్బందికి కూడా అందించనున్నట్లు తెలిపింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande