రాష్ట్రంలో బిజెపి బలంగా ఉంది.. నెం.1గా మేమే ఉంటాం.. తెలంగాణ చీఫ్
హైదరాబాద్, 29 సెప్టెంబర్ (హి.స.) తెలంగాణ రాష్ట్రంలో స్థానిక uఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో.. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు రంగం సిద్ధం చేశాయి. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తమ పార
బిజెపి చీఫ్


హైదరాబాద్, 29 సెప్టెంబర్ (హి.స.)

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక uఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో.. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు రంగం సిద్ధం చేశాయి. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తమ పార్టీ బలహీనంగా లేదని, బలంగా ఉందని.. రానున్న స్థానిక ఎన్నికల్లో నెం.1గా నిలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. రామచందర్ రావు స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లపై అధికార పార్టీపై విమర్శలు చేశారు. ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చే ఉద్దేశ్యం జీవోలో లేనందున 42 శాతం రిజర్వేషన్లకు తాము మద్దతు ఇస్తున్నామని ఆయన తెలిపారు.

ఈ విషయంలో ప్రభుత్వం ముందు నుండి నాటకాలు ఆడుతోందని ఆయన అన్నారు. అలాగే గవర్నర్, బీజేపీ అడ్డుకుంటున్నాయని ఆరోపించిందని, అయితే ఇప్పుడు జీవోను ఎలా జారీ చేశారని ఆయన ప్రశ్నించారు. ఈ జీవోను గతంలోనే ఇచ్చి ఉంటే సమస్య ఇంతవరకు వచ్చేది కాదని రామచందర్ రావు అభిప్రాయపడ్డారు. తమ పార్టీ ఎన్నికలకు పూర్తిగా సిద్ధంగా ఉందని రామచందర్ రావు ప్రకటించారు. స్థానిక ఎన్నికలపై కోర్టులకు వెళ్లిన వారికే ఆ విషయం తెలుసునని, తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీకి బలం బాగా పెరిగిందని, గత ఎన్నికల్లో ఓటింగ్ శాతం కూడా పెరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈసారి స్థానిక ఎన్నికల్లో తాము అత్యధిక స్థానాలు గెలుచుకుని నంబర్ వన్ పార్టీగా నిలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande