అమరావతి, 29 సెప్టెంబర్ (హి.స.)
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఆయుధ పూజ వైభవోపేతంగా జరిగింది. మూలా నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలోని సింహవల్లి తాయారు సన్నిధిలో అర్చకులు స్వామివారికి అలంకరించే ఆయుధాలను పూజించారు. దసరా సందర్భంగా అక్టోబరు 2న శమీ పూజోత్సవం జరుగుతుందని అర్చకులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ