అమరావతి, 29 సెప్టెంబర్ (హి.స.)
విజయవాడ: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉడాన్ యాత్రీ కేఫ్‌ను పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు (Rammohan Naidu) సోమవారం ప్రారంభించారు. ఎయిర్‌పోర్టుల్లో ఆహారం, బేవరేజ్‌లు కేవలం రూ.10 నుంచి అందుబాటులో ఉండటం ద్వారా ప్రతి ప్రయాణికుడికి అదనపు సౌకర్యాన్ని చేరువ చేస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా ప్రయాణికులతో కేంద్రమంత్రి మాట్లాడి వారి అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. అనంతరం ‘అమ్మ పేరుతో ఒక చెట్టు’ కార్యక్రమంలో భాగంగా విమానాశ్రయం ఆవరణలో రామ్మోహన్‌నాయుడు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ఎయిర్‌పోర్ట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ