హైదరాబాద్, 29 సెప్టెంబర్ (హి.స.)
తెలంగాణ ఆర్టీసీ ఎండీగా తన చివరి రోజున సజ్జనార్ బస్సులో కార్యాలయానికి వెళ్లారు. టిక్కెట్టు తీసుకొని మరి ఆర్టీసీ బస్సులో ప్రయాణించి తన నిరాడంబరతను చాటుకున్నారు. తనకెతో ఇష్టమైన సజ్జనార్ కు ఉద్యోగులు బ్యాండు బాజాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడిన వారు.. నేను ఎండీగా వచ్చిన తొలిదశలో 'ఇది మన సంస్థ కాపాడుకుందాం' అనే ధోరణి ఉండేది. ఇప్పుడు 'ఈ సంస్థ నాది, నేను, నా..సంస్థ ఇంకా అభివృద్ధి చెందాలి..' అనే ఆత్మవిశ్వాసం వచ్చిందన్నారు. నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు' అని సజ్జనార్ సందేశమిచ్చారు. ఆయన హైదరాబాద్ సీపీ గా బదిలీ అయ్యారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..