తిరుమల, 29 సెప్టెంబర్ (హి.స.)అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్షదైవం అయిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పెద్దసంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివచ్చి శ్రీవారి దర్శనం, వాహన సేవల్ని తిలకించి పునీతులవుతున్నారు. తాజాగా తిరుమల బ్రహ్మోత్సవాలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికర ట్వీట్ చేశారు.
తిరుమాఢ వీధుల్లో.. బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన గరుడవాహన సేవ కార్యక్రమాన్ని టీటీడీ అధికారులు అద్భుతంగా నిర్వహించారన్నారు. ఈ వాహనసేవలో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి వచ్చిన భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి, వారికి మంచి అనుభూతిని కలిగించారని పేర్కొన్నారు. లక్షలాది మంది భక్తులను సమన్వయం చేయడంలో కీలకపాత్ర పోషించిన టీటీడీ బోర్డుకు, దేవస్థాన అధికారులకు, ఉద్యోగులు, శ్రీవారి సేవకులు, పోలీస్ ఉన్నతాధికారులు, జిల్లా అడ్మినిస్ట్రేషన్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటున్న అశేష భక్తకోటికి ధన్యవాదాలు తెలుపుతూ సీఎం చంద్రబాబు ఎక్స్ లో పోస్ట్ చేశారు
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి