అమరావతి, 29 సెప్టెంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) రేపు మధ్యాహ్నం హస్తినకు వెళ్లనున్నారు. ఈ మేరకు ఆయన విజయవాడ పరిధిలోని గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి మధ్యహ్నం 12.30 గం.లకు బయలుదేరి 1.30 గం.లకు ఢిల్లీ (Delhi)లోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. అనంతరం ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah)తో భేటీ కానున్నారు. ఆ తర్వాత కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమావేశం అయ్యే అవకాశం ఉంది. తిరిగి సాయంత్రం 5 గం.లకు సీఐఐ (CII) సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొని బడా పారిశ్రామికవేత్తల సమక్షంలో పెట్టుబడుపై ప్రసంగించనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి