కర్నూలు, 30 సెప్టెంబర్ (హి.స.)రోజుకొక్క యాపిల్ తింటే డాక్టర్‌తో పని ఉండదని వైద్యులు చెప్పడం మీరు అనేక సార్లు వినే ఉంటారు. కెలోరీలు, పీచు, సి-విటమిన్, కాపర్, పొటాషియంలతో యాపిల్ మంచి పోషకాహారం. మలబద్ధక సమస్యను నివారిస్తుంది..
రోజుకొక్క యాపిల్ తింటే డాక్టర్‌తో పని ఉండదని వైద్యులు చెప్పడం మీరు అనేక సార్లు వినే ఉంటారు. కెలోరీలు, పీచు, సి-విటమిన్, కాపర్, పొటాషియంలతో యాపిల్ మంచి పోషకాహారం. మలబద్ధక సమస్యను నివారిస్తుంది.
ఇది రక్తపోటును క్రమబద్ధం చేస్తుంది. అగ్న్యాశయానికి (పాంక్రియాజ్) మంచిది. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మంట, తాపం, బాధల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మంచి పోషకాలతో దండిగా ఉంటుంది. అందుకే త్వరగా ఆకలి వేయదు.
బరువు తగ్గాలనుకునేవారికి యాపిల్ మంచి ఎంపిక. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఒక ఆపిల్ తింటే, అది మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.
యాపిల్ ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో ఒక యాపిల్ తింటే పెద్ద మొత్తంలో ఫైబర్ అందుతుంది. యాపిల్స్‌లో యాంటీఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
బరువు తగ్గడానికి యాపిల్స్ చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకుంటే వీటిని ఖచ్చితంగా మీ ఆహారంలో చేర్చుకోవాలి. రోజూ యాపిల్ తింటే అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేయడంలో కూడా సహాయపడుతుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి