అమరావతి, 30 సెప్టెంబర్ (హి.స.)కృష్ణా, గోదావరి నదుల పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది ( . భారీ వర్షాల నేపథ్యంలో ఆ రెండు నదులకు ఇన్‌ఫ్లో ఎక్కువగా ఉంది. గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద నీటి మట్టం 48.7అడుగులకు చేరుకుంది. ధవళేశ్వరం వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 10, 27, 276 క్యూసెక్కులుగా ఉంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. గోదావరి వరద మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ