హైదరాబాద్,30 సెప్టెంబర్ (హి.స.)చర్లపల్లి నుంచి సుమారు 130 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. దాదాపు 55 వేల మందికిపైగా ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. దక్షిణ మధ్య రైల్వే అనేక రైళ్లను ఈ టెర్మినల్‌కు మళ్లించగా.. తాజాగా పండగ ప్రత్యేక రైళ్ల సంఖ్య పెరిగింది. సరైన ప్రజా రవాణా సదుపాయాలు కల్పించకుండా రైళ్లను పెంచుకుంటూ పోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరం నుంచి చర్లపల్లికి.. అక్కడి నుంచి గమ్యస్థానాలకు చేరేందుకు అయ్యే ఖర్చు ఒకేలా ఉంటోందని వాపోతున్నారు.
ప్రస్తుతం నగరం మీదుగా విశాఖకు రెండు, తిరుపతి, బెంగళూరు, నాగ్‌పుర్‌కు ఒకటి చొప్పున మొత్తం 5 వందేభారత్ రైళ్లు నడుస్తుండగా.. కొత్తగా చర్లపల్లి - నాందేడ్, నాంపల్లి - పుణె త్వరలోనే ప్రారంభిస్తామని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ