శ్రీశైలం, 30 సెప్టెంబర్ (హి.స.)మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తుండటంతో.. కృష్ణ నదికి వరద పోటెత్తింది. దీనికి తోడు తుంగభద్ర నది కూడా భారీగా ప్రవహిస్తుండటంతో శ్రీశైలం జలాశయానికి (Srisailam Reservoir) ఊహించని స్థాయిలో వరద (flood) పోటెత్తింది. దీంతో అప్రమత్తం అయిన అధికారులు 10 గేట్లు 26 అడుగుల పైకి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం వద్ద కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చి సాగర్ జలాశయంలోకి పరుగులు తీస్తుంది. ఎగువన ఉన్న జూరాల ఇతర ప్రాజెక్టుల నుంచి శ్రీశైలానికి ఏకంగా.. 5,34,281 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. దీంతో అధికారులు 10 గేట్లు, కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల ద్వారా.. 6,42,626 క్యూసెక్కు క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి