అమరావతి, 30 సెప్టెంబర్ (హి.స.)ఎగువున కురిసిన వర్షాలతో రెండు రోజులుగా ఉధృతంగా ప్రవాహించిన కృష్ణా నది(Krishna River) సోమవారం శాంతించింది. దీంతో ప్రకాశం బ్యారేజ్(Prakasam Barrage) దగ్గర కూడా వరద తగ్గుముఖం పట్టింది.
ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 6,54,876 క్యూసెక్కులుగా ఉంది. ప్రకాశం బ్యారేజ్ ప్రస్తుత నీటిమట్టం 15.9 అడుగులుగా ఉంది. అయితే రెండో ప్రమాద హెచ్చరిక మాత్రం కొనసాగుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి