సీఎం రేవంత్ రెడ్డి తో మహేష్ కుమార్ గౌడ్ భేటీ.. తాజా పరిణామాలపై కీలక చర్చ!
హైదరాబాద్, 6 సెప్టెంబర్ (హి.స.) పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో ఇవాళ రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాది పూర్తయిన సందర్భంగా సీఎంను మర్యాదపూర్వకంగా కలిసినట్లు మహ
మహేష్ కుమార్ గౌడ్


హైదరాబాద్, 6 సెప్టెంబర్ (హి.స.)

పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో ఇవాళ రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాది పూర్తయిన సందర్భంగా సీఎంను మర్యాదపూర్వకంగా కలిసినట్లు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ ను సీఎం శాలువా కప్పి అభినందించారు. అనంతరం ఇద్దరు నేతలు పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలిసింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ అంశంతో పాటు రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం.

అలాగే బీసీ రిజర్వేషన్ల విషయంలో త్వరలోనే కామారెడ్డిలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ యోచిస్తోంది. ఈ అంశాలపై కూడా సీఎం, పీసీసీ చీఫ్ చర్చించుకున్నట్లు తెలుస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande